SCI-ART LAB

Science, Art, Litt, Science based Art & Science Communication

El condor pasa, “The condor passes”, or even, the condor flies by, denotes the spirit of freedom. It is about being in control of your life.

A condor is a very large type of bird which is commonly seen in the Andes region of South America

Like while the snail is slow and stuck to the ground, the sparrow is swift and free and can fly to places it wants to reach.

The nail is stuck to the wall and endures pain or oppression, while the hammer is free and strong.

While a forest is huge and can expand, the road is stagnant and trampled upon by others.

So “I would rather be … free, in control of my life, rather than a weak and meek person”. That is what most strong people aspire - like the condor that is passing.

Condor is a symbol of the sky, limitless, free. It is also the King of Birds, and embodies the four cardinal virtues of wisdom, justice, goodness, and leadership.

The meaning is really great and the soft soothing song ‘s made popular by Simon and Garfunkel.

It is a Peruvian song, something like an anthem. Listen to it one more time…

The title of the song is in Spanish because the music was written by Daniel Alomía Robles in 1913 and he was a Peruvian. However, the lyrics were written by Paul Simon. One of the lines that you hear very often in the song is "If I could...", which is often used as another title for this song. So, "El Condor Pasa", or "If I Could". The phrase, "if I could..." expresses possibility. "If I could" means if I were capable, if it were possible for me. It's like a kind of potential. It's like saying, if I had the capacity to do this then I would.

--

There are a few things that the writer, Paul Simon, is really valuing. He's valuing movement. Not being stuck. He doesn't want to be tied to one place and to not have the freedom to move around and make changes in his life. He's saying, if I could, I would rather have a life of change, of evolution, of growth.

The sparrow represents this freedom. He can fly fast and high above everything else, unlike the snail which is stuck on the ground, moving slowly.

The hammer is symbolic of being involved in many different pursuits and also being the one causing the action, making the changes.

And just like the swan, he wants his life to be beautiful. He wants the freedom to be here and to leave. The person who doesn't have this life is like that man who gets tied up to the ground. That man gives the world a sad sound, the saddest sound. This would be the opposite of what he wants for his life.

What else would he really like? He would like to be a forest rather than a street. He wants to be in touch with nature, in touch with the universe and life.

Taking all the lyrics together, I think it's partly a critique of our society, pointing out how many of us have lost our way and gotten distracted in life. It also expresses this primal and deep desire to live lives that are not only meaningful but also beautiful.

While this song had a lot of success in 1970 when it was released, it has had a sort of revival due to the movie Wild. You can hear this song playing all throughout that movie.

                                                      **************8888888***************

Krishna: When the English ridiculed about Indians' inability to dance to their tunes, it was the Indian response.

Natu (Telugu) means 'unrefined' or 'unpolished'. There is beauty in this 'rustic' India.

Then the song describes all those rustic things we do and says, it is in no way inferior to polished dance or culture forms.

There is a nice message in the song. And the world acknowledged it.

I loved it for this message.

Those who can understand this message relish this song and dance.

Different folks , different strokes!

పల్లవి:-
పొలంగట్టు దుమ్ములోన
పోట్లగిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో
పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకొని
కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన
కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన
మిరపతొక్కు కలిపినట్టు
నా పాట సూడు
నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు
చరణం1#
గుండెలదిరిపోయేలా
డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలాగ
కీసుపిట్ట కూసినట్టు
ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు
ఒళ్ళు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు
నా పాట సూడు
నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు…వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు…ఊర నాటు
నాటు నాటు నాటు…గడ్డపారలాగ చెడ్డ నాటు
నాటు నాటు నాటు…ఉక్కపోతలాగ తిక్క నాటు
చరణం 2#
భూమి దద్దరిల్లేలా
ఒంటిలోని రగతమంతా
రంకెలేసి ఎగిరేలా
ఏసేయ్ రో ఎకాఎకీ
నాటు నాటు నాటు…వాహా…ఏస్కో
అరె దుమ్ము దుమ్ము దులిపేలా
లోపలున్న పానమంతా డుముకు డుముకులాడే
దూకెయ్ రో సరాసరి
నాటు నాటు నాటు
--**--
ఆనాటి పల్లె ప్రజల నృత్యoలో ఉన్న ఊపు, వేగం, నాటుదనం, తెలుగుదనం గురించి ఈనాటి యువతకు అర్థం అయ్యే రీతిలో అచ్చతెలుగు పదాల అల్లికతో ఒక పాట రాయాలి' అని భావించారు చంద్రబోస్ గారు. ఇలాంటి చక్కని సందర్భం, స్వేచ్ఛా దొరికినప్పుల్లా తెలుగు భాషాభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు ఆయన. ఈ పాటలో అంతర్లీనంగా ఉన్న ఎన్నో అంశాలలో ఒకటి - కథలో రామ్ ఆంధ్రా నించీ, భీమ్ తెలంగాణ నించీ వస్తారు కనక, ఆయా మాండలికాలు కుడా అక్కడక్కడా స్పృశించారు రచయిత. ఇంకా లోతుగా గమనించే కొద్దీ అంతర్లీనంగా ఎన్నో ప్రత్యేకత అంశాలు ఉన్నాయి ఈ పాటలో. అవన్నీ ఈ వ్యాసంలో ముందుకెళ్ళే కొద్దీ సంపూర్ణంగా తెలుస్తాయి. ఈ నాటు పాట ఇప్పటి మాస్ సాంగ్ అనే పదానికి అప్పటి తెలుగు రూపం. అప్పట్లో నాటు - మోటు - మొరటు వంటి అచ్చతెలుగు పదాలు వాడేవారు పల్లెల్లో.
ఈ నాటు పాటలో నృత్యo ఎలా ఉండబోతోందో పల్లవిలోనే చెప్పారు కవి.
"పొలంగట్టు దుమ్ములోన పొట్లగిత్త దూకినట్టు"
అనడంలో ఒక పల్లె పౌరుషం కనిపిస్తుంది.
" పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్ట"
అనడంలో పల్లె సంప్రదాయ నృత్యంలో ఉన్న భక్తి, చిన్న గగుర్పాటుతో పాటు గొప్ప ఊపు, వేగం, పారవశ్యం... తెలీకుండానే పక్కవాడి చేత కూడా కాలు కదిపించే గుణo కనిపిస్తుంది
" కిర్రు సెప్పులేసుకొని కర్రసాము సెసినట్టు "
అనడం ఒక కుర్రకారు సాహస విన్యాసాన్ని సూచిస్తుంది.
" మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు"
అంటే ఒక సంఘటిత యువశక్తికి సూచకం.
"ఎర్రజొన్న రోట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు"
అనడం ఆనాటి మన వ్యవసాయ సంప్రదాయాన్ని, ఆర్థిక స్థితినీ, ఆహారపుటలవాట్లనీ, అదిచ్చే చేవనీ సూచిస్తుంది.
పల్లవిలో ఆ నాటు నాట్య విన్యాసాలను- ఆనాటి మన సామాజిక అంశాలలోని చేవతో పోల్చారు.
మొదటి చరణంలో... ఆ నృత్యం వల్ల ఒంట్లోని ప్రతీ అంగం ఎలా పూనకాలతో పులకరించిపోతోందో చెప్పారు చంద్రబోస్ గారు.
" గుండెలదిరిపోయేలా డoడనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలాగ
కీసుపిట్ట కూసినట్ట
ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తోక్కేలా దుమ్మారం రేగినట్టు
ఒళ్ళు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు"
అనడంలో
ఆ పల్లె నాటు నృత్యానికి గుండె అదురు పెరిగి, వేళ్లతో చిటికెలు వేసి, కాలు కదం తొక్కి, ఒళ్ళు చెమట పట్టి ఆపాదమస్తకం పరవశంతో ఊగిపోతుంది అని స్వభావోక్తి అలంకారం స్ఫురించేలా చెప్పారు కవి. ఇక్కడ కీసుపిట్ట గురించి చెప్పుకోవాలి, ఇదేదో పిచ్చుకలాగా కాలగర్భంలో కలిసిపోయిన పిట్ట కాదు, తెలంగాణా మాండలీకంలో కీసుపిట్ట అంటే ఈల వేయడం.ఇది పాతకాలం నాటి పల్లెపదం.
అలాగే రెండో చరణంలోని ఉపమానాలలో కవితాత్మక భావావేశం గోచరిస్తుంది.
"భూమి దద్దరిల్లేలా... ఒంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా,
దుమ్ము దుమ్ము దులిపేలా
లోపలున్న పానమంతా దుముకుదుముకులాడేలా"
అనడంలో, వేగం హెచ్చిన నాట్యం వల్ల రక్తం అంతా ఎగజిమ్మడాన్ని కూడా రోషంగా, కవితాత్మకంగా..."రగతమంతా రంకెలేసి ఎగరడం" అంటూ పౌరుషాన్నీ, పోటీతత్వాన్ని సూచించేలా గొప్పగా భావవ్యక్తీకరణ చేశారు రచయిత.
"లోపలున్న ప్రాణం అంతా ఆవేశంగా ఉప్పొంగింది" అనే ఉత్ప్రేక్షని తెలంగాణా మాండలీకంలో "లోపలున్న పానమంతా దుముకు దుముకులాడటం" అంటూ కవితాత్మకoగా వ్యక్తపరిచారు చంద్రబోస్ గారు.
.అలాగే, తొక్కు, కీసుపిట్ట, పానం దుముకులాడటం వంటి తెలంగాణ మాండలీకాలనీ, వాటితోపాటే ఆంధ్రా మాండలీకాలనీ కుడా సమానంగా పాటనిండా పోదిగారు రచయిత.
కళారూపం ఏదయినా... అది ప్రజల వాడుక మాటల్లో ఉన్నప్పుడే అది అన్ని వర్గాల వారిని చేరి సంపూర్ణత్వం సంతరించుకొని పదికాలాల పాటు నిలబడుతుంది.
ఇంత భావసాంద్రత ఉన్న ఈ పాటను "గోల్డెన్ గ్లోబ్" జ్యూరీలోని సభ్యులయిన దర్శకులు, రచయితలు, విమర్శకులు, సామాన్య శ్రోతలు, విభిన్న విభాగాలకు చెందిన నూటయిదుగురు జడ్జీలు, ఆంగ్లంలోకి అనువదించుకొని, ప్రతీ మాటను క్షుణ్ణంగా అవగతం చేసుకొని, అందులో అభ్యంతరకరమైన అంశాలు కానీ, ఎవరి మనోభావాలు దెబ్బతినే అంశాలు కానీ లేవని ఒకటికి వందసార్లు గమనించుకొని, భావవ్యక్తీకరణ శైలిని కుడా గమనించి ఒక నిర్ణయానికి వచ్చారు, శ్రోతల ఉత్సాహం ద్విగుణీకృతం చేసే గొప్ప సంగీతం అందించిన కీరవాణి గారి బాణీ కుడా, నూటైదుగురు జ్యూరీ సభ్యులకు వంక పెట్టడానికి లేనివిధంగా నచ్చి ఈ గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డుని సగర్వంగా ప్రకటించారు.

Views: 71

Replies to This Discussion

RSS

Badge

Loading…

© 2024   Created by Dr. Krishna Kumari Challa.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service