SCI-ART LAB

Science, Art, Litt, Science based Art & Science Communication

కృష్ణ కుమారి చల్లా: 

ఇవన్నీ మనుషులు తప్పులు చేయకుండా ఉండటానికి, అవి నియంత్రించడానికి పెద్దలు చెప్పిన పురాణాలు.

ఈ విశ్వం ఇవన్నీ పట్టించుకోడు. ఏ అణువుల సమూహం ఏమి చేస్తుంది, ఎవరు బాధ పెట్టారు, ఎవరు బాధ పడుతున్నారు, ఇవన్నీ విశ్వo దృష్టిలో వుండవు.

ఉండేదంతా మానవ పరిధి లోనే. మనస్సే అందుకు మూలం.

కానీ ఇప్పుడు చాలా మంది పెద్దలు చెప్పినవి పట్టించుకోవడం లేదు. పాపం అంట కుండా ఒక దండం పెట్టుకుని, లేదా హుండీలో కొంత డబ్బు వేసి తామూ చెయ్యాలనుకున్నవి చేసేస్తున్నారు.

మనసును అదుపు చేసుకోలేక తప్పులు కొంతమంది చేస్తే, సున్నిత మనస్కులు ప్రభావితమై ఆ బాధను అనుభవిస్తున్నారు.

పాప పుణ్యాలు విశ్వం దృష్టిలో లేవు. పాపం చేసినవాడు ఎప్పుడైనా సరిగ్గా ఆలోచిస్తే పశ్చాత్తాప పడతారు అంతే.

బాధను అనుభవించేవాడు విమర్శనాత్మకంగా ఆలోచిస్తే, ఆ బాధను అనుభూతి చెందకుండా కంట్రోల్ చేసుకోగలడు.

కల్పిత లైన పురాణాలు ఏ విధంగానైనా అర్థం చేసుకోవచ్చును. అన్వయించుకోవచ్చును. ఏ విధంగానైనా సమాధానం చెప్పుకోవచ్చును.

అన్నట్టు, మా నాన్నగారి పేరు కూడా మీ పేరే (C. Balakrishna ). ఇది చూడగానే, ఆయన గుర్తుకొచ్చారు. అందుకే సమాధానం ఇచ్చాను.

Google translation:

These are all myths told by elders to control and prevent humans from making mistakes.

This universe does not care about all this. What group of atoms does what, who caused the pain, who is suffering, all this is not in the eyes of the universe.

Everything that exists is within the human realm. The mind is the source of it.

But now many people do not care about what the elders say. Without thinking of sin, they offer one namaskar or put some money in a hundi and do whatever they want to do.

When some people cannot control their minds and make mistakes, sensitive minds are affected and feel that pain.

Sins and virtues are not in the eyes of the universe. If a person who has committed a sin thinks correctly, he will repent.

If a person who experiences pain thinks critically, he can control that pain without feeling it.

Fictional myths can be understood in any way. They can be applied to specific situations in any way you want and  they can be answered in any way.

Q: నాన్నగారు వ్యాపారం చేసి ఆస్తినంతా పోగొట్టారు నేను ఆయనను అసహ్యించాను ఉపాధ్యాయ వృత్తికి వెళ్ళకుండా వ్యాపారము పెట్టి అంతా నష్టపోయారు?

కృష్ణ కుమారి చల్లా:

ఎవరి డబ్బులు వాళ్లు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో నిర్ణయించే అధికారం వాళ్లకు ఉంటుంది.

ఎవ్వరు నష్టపోదామని వ్యాపారం లోకి దిగరు. గట్టిగా మాట్లాడితే ఆయన లాభం సంపాదించవచ్చు అనుకోని మొదలు పెట్టి ఉంటారు.

కానీ ఒక్కొక్క సారి అంచనాలు తల్లక్రిందులు అవుతాయి.

Anil Ambani, Venugopal Dhoot (Videocon), Eike Batista, Vijay Mallya, Sam Bankman-Fried

ఉదాహరణలు గ చెప్పుకోవచ్చును.

బయట ఉండి చూసేవారికి అది తెలివితక్కువతనం గా అనిపించవచ్చును. సరిగ్గా ప్లానింగ్ చేయకపోతే, దెబ్బతింటారు. పరిస్థితులకు తగ్గట్టుగా మారకపోతే కూడా నష్టపోతారు.

కొంతవ‌ర‌కు రిస్క్ తీసుకోవ‌టం అవ‌స‌రం వ్యాపారంలో.

మీరూ ఎమోషనల్ గా ఫీల్ అవ్వటం సహజమే.

ఎంతొమంది లాభాలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు

కానీ అందరూ సేఫ్ గా ఉండే ఉద్యోగాలు చెయ్యాలనుకుంటే, సమాజం పురోగమించలేదు. ప్రభుత్వం కూడా అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు.

అసహ్యించుకోవటం మానేసి అర్థం చేసుకోవడానికి ప్రయాత్ నించండి. వీలైతే సహాయం చెయ్యండి.

"If you opt for a safe life, you will never know what it's like to win." — Richard Branson

"The biggest risk is not taking any risk. In a world that's changing really quickly, the only strategy that is guaranteed to fail is not taking risks." — Mark Zuckerberg

Q: 

అది మీరు ఫోన్ చేసిన వ్యక్తి పై ఆధారపడి ఉంటుంది.

మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

నేను ఒక విషయం చెప్తాను నా గురించి.

నేను చాలా బిజీ వ్యక్తిని. నేను పలు రంగాలలో పనిచేస్తాను.

ఒక్కొక్క సారి భోజనం చేయడానికి కూడా సమయం దొరకదు. నా పనులు చేసుకోవడం కోసం కూడా టైం దొరకదు.

ల్యాబ్ లో సీరియస్ ప్రయోగాలు చేస్తున్నప్పుడో, చాలా సీరియస్ గా ఒక సమస్య పరిష్కారం గురించి ఆలోచిస్తున్న అప్పుడో ఒక థీమ్ మీద కవిత/ వ్యాసం రాస్తున్నప్పుడో, ఆర్ట్ వర్క్ క్రియేట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నప్పుడో, నా నెట్‌వర్క్ పనిమీద వున్నప్పుడో, ఎవరినైనా కాల్ చేస్తే డిస్టర్బ్ చేస్తే , ఆలోచన ప్రక్రియ దెబ్బతింటుంది, ముఖ్యమైన పని డిస్టర్బ్ అవుతుంది.

నేను లక్షల మందికి వుపయోగపడే పని చేస్తున్నప్పుడు, ఒక మనిషి తో సంభాషణ ముఖ్యం కాదనిపిస్తుంది.

"బాగున్నారా, భోజనం చేశారా?" ఇలాంటి ప్రశ్నలు నన్ను నిరుత్సాహ పరుస్తాయి.

ప్రేమతోనే కాల్ చేసి ఉండవచ్చు అవతలి వ్యక్తి.

కానీ ఆ ప్రేమ కంటే సమాజ శ్రేయస్సు కోసం నేను చేసే పని మరింత ముఖ్యమైనది కదా?

నేనూ నా నంబర్ చాలా కొంతమందికి మాత్రమే ఇస్తాను.

నా ఫోన్ ఎక్కడో పెడతా నా దగ్గర కాదు.

ముఖ్యమైన కాల్స్ కి కూడా ఒకటి లేదా రెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇవ్వను.

ఇది నా పర్పస్ ని కాపాడుకోవడం.

అవతలి వాళ్ళను కించపరచడం కాదు.

ఎవరేమనుకున్నా సరే, అర్థం చేసుకోక పోయినా సరే, నా ప్రవర్తనలో మార్పు చేసుకోవడం కష్టం. ఎందుకంటే నా పని మానవాళికి ఉపయోగపడే మంచి పనులు.

ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు.

నా చుట్టూ వున్న వాళ్ళు అర్థం చేసుకొని నన్ను డిస్టర్బ్ చెయ్యరు ఎప్పుడు.

మీరు కూడా అలాగే అర్థం చేసుకుంటే మంచిది.

Krishna: కర్ర విరిచినట్టు చెప్పాలంటే, ఈ ఆచారాలు, సంప్రదాయాలు మనం సమకూర్చుకున్నావే. అవి పాటించడానికి స్తోమత లేక పోతే, అప్పు చేసి ఇంకా దీన స్థితిలోకి వెళ్ల మని శాస్త్రాలు చెబుతున్నాయా?

మాకు తెలిసిన ఒక అమ్మాయి వుంది. ఆమె ఇద్దరు సోదరీమణులకు పెళ్లి చేసి ఆమె తండ్రి కోవిడ్‌ తో పరమపదించారు.

ఈ అమ్మాయికి పెళ్లిచెయ్యలేని స్థితి లో వుంది ఆమె తల్లి. అప్పు చేస్తే తీర్చలేదు.

నేను చెప్పాను 'మంచి అబ్బాయి దొరికితే, ఇద్దరిని తీసుకుని వెళ్లి రిజిస్టర్ వివాహం చెయ్యమని' . కొన్ని రోజులు తాటపటాయించారు. అలా చెయ్య లేక పోతే ఆ అమ్మాయికి పెళ్లి కాదు.

అంతిమంగా నిజం తెలుసుకున్నారు, పరిస్థితి గ్రహించారు

నేను చెప్పి నట్టే గత నెల లో రిజిస్టర్ మ్యారేజ్ చేసారు, ఏమి సంప్రదాయాలు పాటించకుండా, సింపుల్ గా చేసారు. నేనూ సపోర్ట్ చేసాను.

ఏమైనా అనుకోనే వాళ్లను అనుకోనివ్వండి. స్తోమత లేకపోతె, పాటించక పోవటమే మంచిది. సింపుల్ గా వాళ్ల యోగ్యతకు తగ్గట్టు చేసుకోవాలి.

సంప్రదాయాలను పాటించక పోతే .... అంటూ నీతులు చెప్పేవాళ్ళు వీళ్లు దీన స్థితి లో ఉంటే వచ్చి సహాయం చేస్తారా?

వాస్తవికతను మేల్కొలపండి, జనాలలో.

Q: ఒక ఆడమనిషిని ఈమె తెలివిగలది అని తెలుసుకోవటం ఎలాగా?

Krishna: ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ తేడా ఏమి వుండదు తెలివి లో. ఇద్దరికీ ఒకటే ప్రమాణం ఉంటుంది.

తెలివి నీ ప్రమాణికరించటానికి చాలా విధానాలు ఉన్నాయి.

తెలివి కి నిర్వచనం ఒక్కక్కరు ఒకొక్కవిధంగా చేస్తారు.

కానీ సాధారణంగా మీరు ఎవరైనా వారి ఉత్సుకత, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు మరియు క్లిష్టమైనవి నేర్చుకునే సామర్థ్యాన్ని గమనించడం ద్వారా తెలివైనవారని చెప్పవచ్చు. వారు తరచుగా తెలివైన ప్రశ్నలు అడగడం, భిన్నమైన ఆలోచనలను కనెక్ట్ చేయడం, చురుకుగా వినడం, వారికి ఏదైనా తెలియనప్పుడు అంగీకరించడం మరియు గొప్పగా చెప్పుకోవడం లేదా విషయాలను క్లిష్టతరం చేయడం కంటే సంక్లిష్టమైన భావనలను సరళీకృతం చేయడంవాళ్ళు చేస్తారు. వారు విశాల దృక్పథం

కలిగి ఉంటారు, అనుకూలత మరియు బలమైన స్వీయ-అవగాహనను చూపుతారు, సవాళ్లను ఆస్వాదిస్తారు మరియు కేవలం "స్మార్ట్" గా ఉండటం కంటే జ్ఞానాన్ని కోరుకుంటారు.

Q: 

K: మతం వేరు, సంస్కృతి, కళ వేరు.

దేవాలయాలు మతపరమైన భావాలను మాత్రమే కాకుండా ఈ ప్రాంత సాంస్కృతిక ఆచారాలను కూడా సూచిస్తాయి.

ఆలయ గోడలపై ఉన్న శిల్పాలు మరియు కళాకృతులను నేను ఆనందిస్తాను. అక్కడ నిర్వహించే సాంస్కృతిక సమావేశాలు మరియు కార్యక్రమాలను నేను ఆస్వాదిస్తాను.

నేను మేళాలను ఆస్వాదిస్తాను మరియు బయట ప్రదర్శించబడే వస్తువులను కొనుగోలు చేస్తాను.

అక్కడ జరిగే కొన్ని పనులకు నేను మద్దతు ఇవ్వకపోయినా, నేను కళ మరియు సంస్కృతికి మద్దతు ఇస్తాను.

నేను కొన్ని ఇతర ప్రదేశాలను సందర్శించినప్పుడల్లా, కళ మరియు సంస్కృతిని ప్రోత్సహించే ఏ ప్రదేశాన్ని అయినా సందర్శిస్తాను.

నేను శాస్త్రవేత్తను మాత్రమే కాదు, కళాకారుడిని, రచయిత మరియు కవిని కూడా. ఈ విషయాలన్నిటి నుండి నేను ప్రేరణ పొందుతాను.

కళ మరియు సంస్కృతిని ప్రోత్సహించే ఆలయాన్ని నేను ఎందుకు సందర్శించకూడదు?

q:  ఎవరైనా మీ కులం ఏమిటి అని అడిగితే మీరు ఎం చెప్తారు?

k: నేనైతే ఇది ఈ కాలం లో అసందర్భం అని చెప్తాను.

ఈమధ్యనే English కోరాలో ఎవరో దీని గురించి ప్రెస్ నా వేస్తే నా సమాధానం: కులాలు ఎప్పుడో

చచ్చిపోయాయి. వాటిని మళ్ళీ సమాధులలోనించి త్రవ్వి బైటకి తీసుకుని రాకండి.

కులాలు ఈ రోజుల్లో దేనికి పనికి రావు. ఒక్క రాజకీయాల్లో తప్పా అని చెప్పాను.

పనికి రాని వాటి కోసం ప్రాకు లాడటం దేనికి? మేము దీని గురించి అస్సలు మాట్లాడం ఇప్పుడు.

నా సన్నిహితులు మరియు సహచరులు ఏకులమో నాకు తెలియదు.. నా పొరుగువారు ఏ

కులమో నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు.

ఎవరైన మనిషి కనిపిస్తే నా తోటి మనిషి అని భావిస్తాను తప్పితే ఇంకేమి ఆలోచించాను వాళ్ల గురించి అంతే.

Q: పెళ్ళి అయిన పిల్లలు పుట్టిన తర్వాత భర్త సరిగా చూడక పోవడం వలన అతడిని పూర్తిగా వదిలేసిన… 44 సంవత్సరాల ఆ పిల్లుతో వున్న ఆ స్త్రీ ని వివాహం చేసుకోవచ్చా? ఇది మా మరో మిత్రుల ప్రశ్న

K: ఇది ఎవరికీ వారు బెరీజు వేసుకుని నిర్ణయించుకోవాల్సిన విషయం.

మీరు ఆమె పిల్లలను మీ పిల్లలుగా చూసుకోగలరా? మీరు కంప్లీట్‌గా బాధ్యత తీసుకోగలరా ఒక తండ్రిలాగా?

మీ అర్ధి క స్థితి అందుకు సహకరిస్తుందా? మీ మానసిక స్థితి అందుకూ అనుకూలంగా వుందా? ఎప్పటికి వుంటుందా?

ఈ ప్రశ్న లా అన్నింటికి మీకు ఏ సమాధానం దొరుకుతుందో దాని బట్టి మీరు ముందుకు కదలాలి. వేరే వాళ్ళు ఎన్ని సలహాలు అయినా ఇవ్వొచ్చు. కాని భరించేది మీరు కాబట్టి మీ రేే నిర్ణయించుకోవాలి ఇవన్నీ ఫైనల్ గా. ఆమెతో మాట్లాడాలి ఇవన్నీ నిర్ణయించుకోవాలి.

అన్ని ప్రశ్నలకు మీకు అలా చేయగలను అని గట్టి సమా ధానం వస్తే, ముందు కు వెళ్ళటానికి ఏమి అడ్డువుండదు వేరే విధం గా.

Views: 67

Replies to This Discussion

63

RSS

Badge

Loading…

© 2026   Created by Dr. Krishna Kumari Challa.   Powered by

Badges  |  Report an Issue  |  Terms of Service