Poems on the themes of art, science and other inspirational subjects
Manasanta gayalai mandevelale
జీవ రసాయన శాస్త్ర వింతలు ఎవ్వరు అధిగమించలేరులే
మనసంతా గాయలై మండే వేలలే
చిరు జల్లు అయి ఒక మంటను ఆర్పేవేలే
ఆత్మీయులు తెచ్చే ప్రేమ వలయాలే
అవి కాదంటే వుండవులే
ఇది నిజమయ్యే తరుణాలే
గుండెకు తెలుసు దానికి కారణమే
ఎవరైన తప్పించుకోలేరులే
ఆ భావోద్వేగపు పరుగులే
నీకైనా తెలియదులే
నీలో దాగివున్నా అనగారిన ప్రేమలే
వాటినీ పైకి తెచ్చే రోజులె
అవి వరదల వచ్చెనులే
నిన్ను నీకే తెలియని లోకలకి తీసుకుని వెళ్ళెనులే
ఆపగలవా ఆ అనురాగపు వుధృతులే
చేతులెత్తి ఏమి చెయ్యలేక చూస్తు వుండిపోతావులే
నిస్సహాయంగా వాటిముందు మోకరిల్లకుండా వుండలేవులే
హార్మోన్ల తాకిడి తప్పదులే
జీవ రసాయన శాస్త్ర వింతలు ఎవ్వరు అధిగమించలేరులే
ఎ ప్రాణి ఇందుకు మినహాయింపు కాదులే
ఇవి శాస్త్రం చెప్పే పూర్తి నిజాలే
Dr. Krishna Kumari Challa
45
Jul 20, 2023